chloroform was invented only after reading bible (బైబిల్ చదివి క్లోరోఫాం (మత్తు మందు) కనుగొన్న జేమ్స్ సింప్సన్)

క్లోరోఫాం అనే మత్తు మందును కనుగొన్న శాస్త్రజ్ఞుడి పేరు జేమ్స్ సింప్సన్, ఇతను 1811 జూన్ 7న స్కాట్లాండ్ దేశములో జన్మించాడు.

ఇతను క్లోరోఫాం కనిపెట్టక ముందు ఎవరికైనా ఆపరేషన్ చెయ్యాలంటే రోగిని నలుగురు, ఐదుగురు బలవంతముగా పట్టుకొని ఆపరేషన్ చేసేవారు. రోగికి మత్తు ఇవ్వనందున, ఎక్కువ శాతం ఆపరేషన్లు విఫలం అయ్యేవి. అయితే జేమ్స్ సింప్సన్ 1847లో క్లోరోఫాం కనిపెట్టిన తరువాత వైద్య రంగంలో ఆపరేషన్లు (శస్త్ర చికిత్స) చెయ్యడం సులభం అయింది.

ఇంత గొప్ప మందుని కనిపెట్టిన ఈయనకు సన్మానం చేస్తుండగా, కొందరు వ్యక్తులు జేమ్స్ సింప్సన్ గారు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? దీనిని మీరు ఎలా కనిపెట్టగలిగారు? అని అడిగారు. దానికి జేమ్స్ సింప్సన్ ఇచ్చిన సమాధానం అందరిని ఆశ్చర్యపరచినది.

నేను బాల్యం నుండి దైవ భయం, భక్తి కలిగిన వాడను గనుక ప్రతి రోజు బైబిలు చదువుట వాడుక. బైబిలు చదువుట, ప్రార్థన లేకుండా నేను ఏ పని చెయ్యను. అదే విధముగా ఒక రోజు ఆదికాండం చదువుచుండగా దేవుడు ఆదాముకు చేసిన ఆపరేషన్ గురించి చదివాను.

అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ఎముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను. (ఆదికాండము 2:21)

ఈ మాటలు చదివినప్పుడు నాలో ఒక ఆలోచన పుట్టింది. దేవుడు ఆదాముకు చేసిన ఆపరేషన్లో మొదటిగా ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసాడు, గనుక ఆపరేషన్ చేయవలసిన రోగికి ముందుగా గాఢ నిద్ర కలుగజేయాలి. అలా గాఢ నిద్ర కలుగజేయడానికి ఏదైనా మందు కనుగొంటే వైద్య రంగంలో ఆపరేషన్ సులభం అవుతుంది అని ఆలోచించి కొన్ని మూలికల ద్వారా క్లోరోఫాం అను మత్తు మందును కనిపెట్టాను.

నేను క్లోరోఫాంను కనిపెట్టుటకు ప్రధమ కారణం “పరిశుద్ధ గ్రంధము” చదువుటయే. బైబిలు నేను చదవకపోయి ఉంటే, క్లోరోఫాం కనిపెట్టే వాడిని కాదు అని చెప్పాడు.

దేవునికే మహిమ కలుగును గాక, ఆమెన్.