williamse thought to prove bible wrong

సుమారు 100 సం||అ క్రితం ” విలియమ్ రామ్ సే ” అని బ్రిటిష్ యవ్వనస్థుడు బైబిల్ గ్రంథమందు వ్రాయబడిన లూకా సువార్త మరియు అపోస్తులుల కార్యములు రెండు గ్రంథములు సమయ సందర్భాములేని గ్రంథాలు , అవి శుద్ధ తప్పు అని నిరూపించవలెనని కంకణం కట్టుకొనెను .

అందు నిమిత్తం సరాసరి యెరూషలేము పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి లూకా సువర్తకు , అసలు చరిత్రకు పొంతన లేదని నిరూపించ చూచెను . చైనా ఆసియా మరియు గ్రీసు ప్రాంతాలు దర్శించి వారి దగ్గరున్న పురాతన ఆధారాలను ,కొలతలను , సమయ సందర్భాలను తెలిపే పురాతన పద్దతులను అన్ని స్వీకరించి లూకా సువార్తను , అపోస్తులుల కార్యములను బహు జాగ్రత్తగా పరిశీలించగా … లూకా భక్తుడు వ్రాసిన లూకా సువార్తను , అపోస్తులుల కార్యములలో వ్రాయబడిన సంగతులకు తాను స్వీకరించిన చరిత్ర వాస్తవాలకు యే మాత్రం తేడా లేకపోవడాన్ని చూసి బహుగా ఆశ్చర్యపడి , ఇంత ఖచ్చితముగా ఈ గ్రంథములు వ్రాయబడినవంటే ఇవి తప్పనిసరిగా దేవుని చేత వ్రాయబడెనని ఒప్పించబడి ఆనాడే తాను క్రైస్తవుడుగా మారెను . అంతేకాకుండా ఆ తర్వాత క్రైస్తవ చరిత్రలో విలియమ్ రామ్ సే లిఖించిన “నూతన నిబ్బంధన చరిత్ర మరియు వాస్తవాలు ” అనే పుస్తకం నేటికి చరిత్ర వాస్తవాలకు గీటురాయిగా పరిగణించబడుతుంది .